ఆ ప్యాసింజర్ రైళ్ల టైమింగ్స్ షెడ్యూల్లో మార్పులు
ఆ ప్యాసింజర్ రైళ్ల వేళల్లో మార్పులు
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రేపల్లె-తెనాలి, రేపల్లె-గుంటూరు ప్యాసింజర్ రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్టు రైల్వే సీనియర్ డీసీఎం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు అమలులో ఉన్న షెడ్యూల్ ప్రకారం 77227 నెంబర్ కలిగిన రేపల్లె- తెనాలి డెమూ ప్యాసింజర్ రైలు మధ్యాహ్నం 3.25కి బయల్దేరి సాయంత్రం 4.25కి తెనాలి చేరుకుంటోంది. అయితే, సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 4 గంటలకు రేపల్లె నుంచి బయల్దేరి 4.04 గంటలకు పల్లె కోన, 4.14 గంటలకు భట్టిప్రోలు, 4.20 గంటలకు పెనుమర్రు, 4.29 గంటలకు వేమూరు, 4.36 గంటలకు జంపని, 4.45 గంటలకు చినరావూరు మీదుగా 5 గంటలకు తెనాలి చేరుకోనుందని డీసీఎం వివరించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న షెడ్యూల్ ప్రకారం 77228 నెంబర్ కలిగిన తెనాలి-రేపల్లె ప్యాసింజర్ రైలు సాయంత్రం 4.35 గంటలకు తెనాలి నుంచి బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు రేపల్లె చేరుకుంటోంది. అయితే, ఈ నెల10వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 5.10 గంటలకు తెనాలి నుంచి బయలుదేరి 5.14 గంటలకు చినరావూరు, 5.23 గంటలకు జంపని, 5.30 గంటలకు వేమూరు, 5.38 గంటలకు పెనుమర్రు, 5.44 గంటలకు భట్టిప్రోలు, 5.52 గంటలకు పల్లెకోన మీదుగా 6.05 గంటలకు రేపల్లె చేరుకోనుంది.
అలాగే 77229 నెంబర్ గల రేపల్లె-గుంటూరు డెమూ ప్యాసింజర్ ప్రస్తుతం సాయంత్రం 6 గంటలకు రేపల్లె నుంచి బయల్దేరి రాత్రి 8 గంటలకు గుంటూరు చేరుకుంటోంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 6.15కి రేపల్లెలో బయల్దేరి 6.21 గంటలకు పల్లెకోన, 6.29 గంటలకు భట్టిప్రోలు, 6.35 గంటలకు పెనుమర్రు, 6.44 గంటలకు వేమూరు, 6.51 గంటలకు జంపని, రాత్రి 7 గంటలకు చినరావూరు, 7.08 గంటలకు తెనాలి, 7.15 గంటలకు అంగలగుదురు, 7.22 గంటలకు సంగం జాగర్లమూడి, 7.30 గంటలకు వేజండ్ల మీదుగా రాత్రి 8.15 గంటలకు గుంటూరుకు చేరుకోనుంది.