Revanth Reddy AP Tour: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలను ప్రస్తావిస్తూ భవిష్యత్‌ ఫలితాలు ఎలా ఉన్నాయో జోష్యం చెప్పారు. 2029 ఎన్నికల్లో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్‌ గాంధీ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ షర్మిల ఎన్నికవుతారని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ వారసురాలు షర్మిల అని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సేవలను రేవంత్‌ కొనియాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?


విజయవాడ తాడేపల్లిలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సాఆర్‌ 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, ప్రభాకర్‌, సురేఖ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరైన అతిథులంతా ప్రసంగించారు. ముఖ్యమంత్రి అతిథిగా హాజరైన రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపించారు.

Also Read: YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో


'వైఎస్సార్ జ్ఞాపకాలు శాశ్వతం. ఆయన సంక్షేమ పథకాల సృష్టి కర్త. మన కుటుంబంలో వైఎస్సార్‌ ఒకరు. వైఎస్సార్‌ జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవారి గుండెల్లో బల పడుతున్నాయి' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు. 'ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువలేదు. వైఎస్సార్‌తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. తొలిసారి శాసనమండలిలో నేను అడుగు పెట్టా. ఆయన దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించేవాడిని. పిల్లవాడు అని కాకుండా వైఎస్సార్‌ ప్రతి అంశానికి సమాధానం చెప్పే వాడు' అని గుర్తుచేసుకున్నారు.


ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ.. 'ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్సార్‌ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చాడు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడంతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేంద్రంలో ప్రతిపక్ష హోదా వచ్చింది. మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 


'వైఎస్సార్‌ అంటే మడమ తిప్పేది లేదు.. మాట తప్పేది లేదు. ఈరోజు ఏపీలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది. 2009 నుంచి ఈనాడు వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్' అని అభివర్ణించారు. ఇక్కడ అంతా పలక పక్షమేనని.. అంతా బీజేపీ పక్షమేనని చెప్పారు. ఏపీలో ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమేనని స్పష్టం చేశారు.


'ప్రజా సమస్యల మీద షర్మిల మాత్రమే కొట్లాడుతోంది. 2024లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం' అని రేవంత్‌ జోష్యం చెప్పారు. కుటుంబసభ్యులకు వారసత్వం రావడం కాదని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేశారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులని పేర్కొన్నారు. 'వైఎస్సార్‌ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసుడు కాదు' అని జగన్‌ పేరేత్తకుండా విమర్శించారు. కాగా అంతకుముందు తలంగాణ మంత్రులు ప్రసంగించారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి