Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనం
Revanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
Revanth Comments: ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నిక రాబోతున్నదని చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో కడప లోక్‌సభకు ఉప ఎన్నిక వస్తుందని తెలుస్తోందని.. ఎన్నిక గనుక వస్తే తాను కడప వీధుల్లో తిరుగుతానని ప్రకటించారు. వైఎస్సార్ పేరుతో జగన్ వ్యాపారం చేసేవారిగా రేవంత్ పరోక్ష విమర్శలు చేశారు. వైఎస్సార్‌కు నిజమైన వారసత్వం షర్మిల అని తెలిపారు.
Also Read: Revanth YS Sharmila: 2029లో ఏపీ సీఎంగా వైఎస్ షర్మిల.. ఇది తథ్యం: రేవంత్ రెడ్డి
విజయవాడ తాడేపల్లిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన సేవలను కొనియాడుతూనే వైఎస్ జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కుటుంబసభ్యులకు వారసత్వం రావడం కాదని.. ఆయన ఆశయాలు పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులని పేర్కొన్నారు. 'వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసుడు కాదు' అని జగన్ పేరేత్తకుండా విమర్శించారు.
Also Read: YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్ జగన్.. తన కాన్వాయ్‌లో
'వైఎస్సార్ అంటే మడమ తిప్పేది లేదు.. మాట తప్పేది లేదు. ఆయన మాదిరి ఈరోజు ఏపీలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది' అని షర్మిలపై ప్రశంసలు కురిపిస్తూనే వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. 2009 నుంచి షర్మిల ప్రజల మధ్యనే ఉంటోందని.. 1999లో వైఎస్సార్ స్ఫూర్తిని షర్మిల కొనసాగిస్తుందని చెప్పారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం షర్మిలనేనని పేర్కొన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అభివర్ణించారు. అందరూ బీజేపీ మనుషులేనని తెలిపారు.
'2024లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'కుటుంబసభ్యులకు వారసత్వం రావడం కాదు. ఆయన ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులు. వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసుడు కాదు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల భాద్యతలు తీసుకున్నారు' అని రేవంత్ తెలిపారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. కడప లోక్‌సభ స్థానంపై స్పందిస్తూ ఉప ఎన్నిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కడప ఉప ఎన్నిక వస్తుందట. అదే జరిగితే నేను భాధ్యత తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడపలోనే ఉంటా.. గల్లీ గల్లీ తిరుగుతా' అని సంచలన ప్రకటన చేశారు. 'ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అంటారు. ఇదే కడప గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం. మీరందరూ కలిసి రావాలి' అని పిలుపునిచ్చారు.
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యాచరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ సుముఖంగా లేరని.. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం పరిశీలిస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది. వైఎస్ అవినాశ్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఉప ఎన్నికలో పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఉప ఎన్నిక వస్తే షర్మిలను నిలబెట్టి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తానని రేవంత్ పేర్కొన్నారు. మరి ఇది నిజమా కాదా అనేది జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి