Kuppam Clash: కుప్పంలో మళ్లీ అల్లర్లు..చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ధ్వంసం
Kuppam Clash: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మళ్లీ అల్లర్లు జరిగాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పూర్తిగా ధ్వంసం చేశారు.
Kuppam Clash: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మళ్లీ అల్లర్లు జరిగాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పూర్తిగా ధ్వంసం చేశారు. కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ టెంటు, బ్యానర్లు ధ్వంసం చేశారు. వైసీపీ నేతల దాడితో కుప్పంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. అన్న క్యాంటీన్ పై దాడికి నిరసనగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దాడికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కుప్పంలో అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అన్న క్యాంటీన్లపై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు లోకేష్. వైసిపి రౌడీలు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ లో మండిపడ్డారు.
ఇటీవలే కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ ర్యాలీలు తీశాయి. చంద్రబాబు పర్యటన సాగుతుండగానే.. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్ పై దాడి చేశారు. ధ్వంసం చేశారు. అయితే దాడి తర్వాత అన్న క్యాంటీన్ ను అక్కడే ప్రారంభించారు చంద్రబాబు. అప్పటి నుంచి అన్న క్యాంటీన్ లో ఉచితంగా పేదలకు భోజనం అందిస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను తాజాగా మరోసారి ధ్వంసం చేశారు వైసీపీ మద్దతుదారులు. ఈ ఘటనతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
Read Also: AP POLITICS: ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్.. టీడీపీ పొత్తుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
Read Also: JAGAN Mangalagiri: మంగళగిరిలో ప్లాన్ మార్చిన సీఎం జగన్.. నారా లోకేష్ సీటు మార్చుకోవాల్సిందేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి