RK Roja Sensational comments on Nara Lokesh Padayatra: ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎప్పటిలానే తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అవడం రాష్ట్రం అదృష్టం అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్న రోజా చంద్రబాబు 2022లో పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్ ను తిట్టడానికే చంద్రబాబు రాష్ట్రానికి వస్తాడని, లోకేష్ పప్పు తినటానికి మాత్రమే పనికి వస్తాడని, దత్త పుత్రుడు పవన్ ఏమో రెండు చోట్లా ఓడిపోయాడని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు చంకలో కూర్చోవటం మినహా మరొక పని లేదు దత్త పుత్రుడికి అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని విమర్శించిన ఆమె విశాఖపట్నం వ్యతిరేకి పవన్ కళ్యాణ్ అంటూ విమర్శించారు. ఇక చంద్రబాబు కందుకూరులో 8 మందిని, గుంటూరులో 3ని చంపేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?? అని ప్రశ్నించిన రోజా చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 40 మంది ప్రాణాలు తీశాడని విమర్శించారు.


అందుకే ప్రజలు చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పేర్కొన్న రోజా రాత్రి పూట డ్రోన్ షాట్ల కోసం సందుగొందుల్లో సభలు పెడుతున్నాడని అన్నారు. ఇంత జరుగుతున్నా మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన రోజా 2022 ముగింపుకి 8 మందిని చంపాడు, 2023 ప్రారంభంలో ముగ్గురిని చంద్రబాబు చంపాడని అన్నారు. లోకేష్ పాదయాత్ర డైవర్ట్ చేయటానికే వైసీపీ నేతలు ఇది చేశారని టీడీపీ నాయకులు అంటున్నారని అలా అనడానికి వారు అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా?? అని ప్రశ్నించారు.


ఇక టీడీపీ నాయకులకే  లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు... లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. ఇక శాసన మండలిలో లోకేష్ అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 8 మంది చనిపోయారని ఆమె విమర్శించారు.  
Also Read: Dil Raju Shock: చిరంజీవి, బాలయ్య కంటే తోపు అనిపించుకున్న దిల్ రాజు?


Also Read: Girl Killed Own Mother: లవర్ పై రేప్ కేసు పెట్టిందని తల్లిని దారుణంగా చంపిన కూతురు.. రాత్రంతా శవం పక్కనే రొమాన్స్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook