Girl Killed Own Mother: లవర్ పై రేప్ కేసు పెట్టిందని తల్లిని దారుణంగా చంపిన కూతురు.. రాత్రంతా శవం పక్కనే రొమాన్స్?

Minor Girl Stabbed Own Mother: తాను ప్రేమించిన అబ్బాయి మీద రేప్ కేసు పెట్టి అరెస్ట్ చేయించడమే కాక తన ప్రేమకు అడ్డు వస్తుందని తన తల్లిని దారుణంగా చంపేసింది ఒక మైనర్ బాలిక. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 2, 2023, 02:47 PM IST
Girl Killed Own Mother: లవర్ పై రేప్ కేసు పెట్టిందని తల్లిని దారుణంగా చంపిన కూతురు.. రాత్రంతా శవం పక్కనే రొమాన్స్?

Minor Girl Stabbed Own Mother with Her Lover in Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సంచలనం సృష్టించిన హత్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ మైనర్ బాలిక తన ప్రేమికుడితో కలిసి తల్లిని గొంతు కోసి హత్య చేసింది. అంతేకాదు అక్కడితో ఆమె పగ చల్లారలేదో ఏమో కానీ తన తల్లిని చంపిన తర్వాత కూడా కత్తితో శవాన్ని పలుమార్లు పొడిచింది. తన తల్లి తన ప్రేమికుడిని ఇష్టపడలేదని, అతనితో తన పెళ్లి చేయదేమో అనే కారణంతో బాలిక ఈ దురాగతానికి పాల్పడింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి ఎవరి కోసం తల్లిని చంపిందో ఆ ప్రేమికుడి మీద సదరు బాలికపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై అతను జైలుకు కూడా వెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే భింద్‌కు చెందిన ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించేది. ఆమె కుమార్తెను సోను అనే యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.

ఈ విషయమై మహిళ కోర్టును ఆశ్రయించడంతో విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని సోనూపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. నిజానికి వారిద్దరూ ప్రేమించుకోగా అది ఇష్టం లేని ఆమె కిడ్నాప్ చేసి రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఇక గత నెలలో సోనూ జైలు నుంచి బయటకు రావడమే కాక సదరు మైనర్ అమ్మాయిని కలవడం ప్రారంభించాడు. ఈ విషయం బాలిక తల్లికి ఇష్టం లేకున్నా కూతురు ఆమె మాట వినలేదు.

ఆమె తన తల్లిని తమ లవ్ లైఫ్ కి అడ్డంకిగా భావించడంతో  శుక్రవారం రాత్రి ప్రియుడితో కలిసి తల్లిని చంపాలని ప్లాన్ చేసి గొంతు కోసి హత్య చేసింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కత్తితో పలుమార్లు పొడిచి పొడిచి పగతీర్చుకుంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే ఆ రాత్రంతా మృతదేహంతో బాలిక, ఆమె ప్రేమికుడు ఇంట్లోనే ఏకాంతంగా గడిపినట్టు చెబుతున్నారు.

ఇక విషయం తెలుసుకున్న ఇంటి యజమాని శనివారం రాత్రి హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంచం కింద పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించి ఈ సంఘటనలో తన ప్రేమికుడి ప్రమేయం గురించి కూడా బయటపెట్టింది. ఈ క్రమంలో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read: Shock to Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ కు దిల్ రాజు వరుస షాకులు.. పోటీగా మూడు సినిమాలు రిలీజ్!

Also Read: Dil Raju Shock: చిరంజీవి, బాలయ్య కంటే తోపు అనిపించుకున్న దిల్ రాజు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News