Roja Video Viral: ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈమె మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈమె  తమిళనాడులోని తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత నటి రోజాను కలవడానికి వచ్చిన గుడిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పట్ల నీచంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఆలయంలో దర్శనం ముగించుకొని బయటకు భర్త సెల్వమణితో కలిసి బయటకు వస్తోన్న రోజాతో పలువురు సెల్ఫీ తీసుకోవడాని ఎగబడ్డారు. అటు రోజా కూడా తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన వారిందరితో సెల్ఫీలు దిగింది. ఈ కమ్రంలో ఆలయంలో క్లినింగ్ సిబ్బంది రోజాతో ఫోటో దిగడానికి వచ్చిన వారితో చేతులో వెనక్కి నిలబడమని చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు తిరుచెందూరులోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడిమాస అభిషేకం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో నటి రోజా.. తన భర్త సెల్వమణితో కలిసి నిన్న ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామి దర్శనం తర్వాత బయటకు రాగానే పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయానికి సంబంధించిన  స్టాఫ్ నటి రోజాను తమ సెల్ ఫోన్లలో బంధించారు. అదే సమయంలో ఆలయంలో పనిచేస్తోన్న ఇద్దరు ప్రైవేట్ క్లీనింగ్ వర్కర్స్ రోజాతో సెల్ఫీ దిగడానికి ఆమె దగ్గరకు వెళ్లారు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఈ సందర్భంగా రోజా వారిని తన దగ్గరకు రావొద్దని వారించింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ వైరల్ గా మారింది. నటి రోజా స్వచ్ఛ్ కార్మికులను దూరంగా ఉండమని చెబుతున్న దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్స్ రోజా తీరును ఏకి పారేస్తున్నారు. మాజీ మంత్రి గా ప్రజలందరిని సమానంగా చూడాల్సిన బాధ్యతలో ఉన్న రోజా.. ఆలయంలో అంటరానితనాన్ని కొనసాగిస్తూ.. స్వచ్ఛ కార్మికులను పక్కన పెట్టడం ఇపుడు దుమారంగా మారింది. రోజా విషయానికొస్తే.. గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్ధఇ చేతిలో  దారుణంగా ఓడిపోయారు. ప్రజలు ఓడించినా.. రోజా  బుద్ధిలో మార్పురాలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?