Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 12, 2024, 04:10 PM IST
 Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

Ram Charan: రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఆచార్యతో తన తండ్రి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా పెద్దగా అలరించలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్.. రాజమౌళి తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. దాదాపు ఈ సినిమా కోసం చరణ్.. మూడేళ్లు కేటాయించాడు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, రెండు పాటలు మినహా పెద్దగా ఏది విడుదల కాలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. శంకర్ .. భారతీయుడు 2 తర్వాత వస్తున్న ఈ చిత్రం కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

అంతేకాదు భారతీయుడు 2 హిట్టైయితే.. ‘గేమ్ ఛేంజర్’ మూవీకి మంచి ఊపు వస్తుందని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊహించుకున్నారు. కానీ ఈ రోజు విడుదలైన ‘భారతీయుడు 2’ సినిమా చూసి మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోతో శంకర్ ఏదో ఊడ బొడుస్తాడనుకుంటే.. పాత భారతీయుడు, అపరిచితుడు సినిమాలోని సీన్స్ ను వాడుకొని కథ లేకుండా.. కేవలం భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ విషయంలో శ్రద్ధ పెట్టిన శంకర్.. టేకింగ్ విషయంలో తడబడ్డాడు. కథ లేకుండా ఏదో చిన్న పాయింట్ చుట్టూ అల్లాడు. మొత్తంగా ‘భారతీయడు 2’ను భరించడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఈ సినిమాకు మరో పార్ట్ ‘భారతీయుడు 3’ వచ్చే యేడాది రాబోతున్నట్టు చివర్లో చెప్పడం కొసమెరుపు. మొత్తంగా తెలుగులో ‘భారతీయుడు 2’ తెలుగులో నిలబడటం కష్టమే అని చెప్పాలి.  

‘భారతీయుడు 2’ మూవీకి వస్తోన్న టాక్ తో రామ్ చరణ్ అభిమానులను భయం పట్టుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారతీయుడు 2 సినిమాతోనే శంకర్ పూర్తిగా తడబడ్డాడు. ఇపుడు రామ్ చరణ్ తో చేస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ ఎలా ఉండబోతుందో అని అభిమానులు బెంగ పెట్టుకుంటున్నారు. ఈ సినిమా ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. మరి ఆ కథను రామ్ చరణ్ తో శంకర్ ఎలా డీల్ చేస్తాడనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతీయుడు 2లాగా కథ లేకుండా కేవలం కాంబినేషన్ ను నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించాడా..? పకడ్బంది కథతో తెరకెక్కిస్తున్నాడా..అనే దానిపై ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.  పైగా రాజమౌళితో సినిమా చేసిన హీరోలు.. అంత ఈజీగా హిట్ కొట్టలేరనే టాక్ ఉంది. మరి అంచనాలను బ్రేక్ చేస్తూ గేమ్ ఛేంజర్ మూవీతో శంకర్ రామ్ చరణ్ కు హిట్ అందిస్తాడా.. ?లేదా అనేది చూడాలి.

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News