Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయానికి స్పందించి ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు. దీంతో ఒక్కసారిగా అతడు హీరోగా మారిపోయాడు. దక్షిణ మధ్య రైల్వే మండల విభాగం ఇందుకు సంబంధించిన వీడియోను తమ ఫేస్‌బుక్(Facebook) పేజీలో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన ఓ కుటుంబం నిద్రమత్తులో ఉండటంతో గమ్యస్థానంలో తిరుపతిలో రైలు దిగలేకపోయారు. అంతలోనే రైలు బయలుదేరడాన్ని గమనించి, తాము దిగాల్సిన స్టేషన్ ఇదేనంటూ హడావుడిగా రైలు దిగే ప్రయత్నం చేశారు. మొదటగా ఓ మహిళ రైలు దిగారు, మరో మహిళ రైలు దిగే ప్రయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ వద్దంటూ ఆమెను వారించారు. అయినా రైలు దిగే ప్రయత్నం చేయడంతో ఆ మహిళ ప్లాట్‌ఫామ్ మీద పడిపోయారు. అక్కడి నుంచి రైలు పట్టాలపై పడిపోబోతుండగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్(RPF Constable) సతీష్ సమయోచితంగా వ్యవహరించి పక్కకు లాగేసి ఆమెను రక్షించారు.


Also Read: Curfew guidelines అతిక్రమించిన వారికి రోడ్డుపై కప్పగంతులు శిక్ష



మహిళా ప్రయాణికురాలని కానిస్టేబుల్ సతీష్ కాపాడుతున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ దక్షిణ మధ్య రైల్వే తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా వీడియో వైరల్(Viral Video) అవుతోంది. మహిళ ప్రాణాలు రక్షించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్‌ను ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశింసిస్తున్నారు.


Also Read: Twitter Features: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్, ఇకనుంచి నగదు సంపాదించుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook