మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) సరికొత్త ఫీచర్‌ను తన వినియోగదారులకు తీసుకొచ్చింది. ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు టిప్ జార్ ఐకాన్(Tip Jar Icon)ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. గత కొంతకాలం నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి డెవలపర్స్ తీవ్రంగా శ్రమించగా తాజాగా ఫలితం అందుకున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ టిప్ జార్ సౌకర్యం ద్వారా తాము పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని క్యాష్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. న్యూస్‌లెటర్స్, సూపర్ ఫాలో అనే సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ కరోనా సమయంలోనూ దూకుడు కొనసాగిస్తోంది. టిప్ జార్ అనే సరికొత్త ఫీచర్‌ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తెచ్చిందని మాషబుల్ ఇండియా రిపోర్ట్ చేసింది. టిప్ జార్ అనేది పాట్రియన్, పేపాల్, వెన్మో మరియు క్యాష్ యాప్ లాంటి పేమెంట్ సేవలు అందించే ఫ్రొఫైల్ కలిగి ఉన్న వారికి సర్వీస్ అందిస్తుంది.
Also Read: Gold Price In Hyderabad: గుడ్ న్యూస్.. మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు
సరిగ్గా ఇలాంటి సరికొత్త సదుపాయాన్ని ట్విట్టర్ కంపెనీకి చెందిన ఆడియో మాత్రమే ఉండే స్పేసెస్ ప్లాట్‌ఫామ్‌లో సైతం తీసుకురానుందని సమాచారం. క్లబ్‌హౌస్ అనే ఆడియో ఛాట్ యాప్‌తో పోటీ పడాల్సి వస్తోంది. ఈ ఫీచర్‌ను మీరు ఆన్ చేయగానే టిప్ జార్ ఐకాన్ ట్విట్టర్ ఖాతాదారులను మానిటైజేషన్‌కు అవకాశాన్ని కల్పిస్తుంది. ఖాతాదారుల నుంచి టిప్స్ తీసుకుని వారికి నగదు చెల్లించనుంది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ టిప్ జార్ ఫీచర్‌ను ఇంకా అధికారికంగా అందుబాటులోకి తీసుకురాలేదు. మాషబుల్ ఇండియా ప్రకారం.. ఎలాంటి ట్విట్టర్ ఖాతాదారులకు, ఏ ప్రొఫైల్ ఉన్న వారికి మానిటైజ్ ద్వారా నగదు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ట్విట్టర్ దీనిపై అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook