Budameru Floods: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉందనే ప్రచారం నేపథ్యంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బుడమేరు కట్ట తెగిందనే వార్త కలకలం రేపింది. ఇప్పటికే జలదిగ్భందంలో వారం రోజులు మునిగిన విజయవాడ అది మరవకముందే మరో ప్రమాదం సంభవించిందనే వార్తతో భయాందోళన చెందారు. అయితే ఆ వార్త పుకారు మాత్రమేనని బుడమేరుకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anchor Shyamala: యాంకర్ శ్యామలకు కీలక పదవి.. వైయస్ జగన్ కొత్త ప్లాన్..!


 


ఈనెల ఆరంభంలో విజయవాడలో వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. బుడమేరు వాగుకు గండ్లు పడి వరద పోటెత్తగా.. దానికి కృష్ణా వరద కూడా తోడవడంతో విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వారం రోజుల తర్వాత అక్కడ పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం బుడమేరు వాగుకు గండి పడిందనే వార్త దావానంలా వ్యాపించింది. సామాజిక మాధ్యమాలు, కొన్ని ప్రధాన మాధ్యమాల్లో వచ్చినట్లు తెలిసింది. కొత్త రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీలతోపాటు వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తిందనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బుడమేరుపై కీలక ప్రకటన జారీ చేశారు.

Also Read: AP Cyclone: ఏపీకి మరో వాన గండం.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం..


 


'బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లు నమ్మవద్దు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటాం' అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రకటించారు. కొందరు ఆకతాయిలు ఇలాంటి వదంతులను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని గుర్తించినట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.


మంత్రి నారాయణ స్పందన
బుడమేరుకు గండి ఏర్పడ విజయవాడకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉందనే వార్తలపై మంత్రి నారాయణ కూడా స్పందించారు. విజయవాడలోని కొన్ని కాలనీల్లో వరద వస్తోదందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. 'బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉంది' అని మంత్రి నారాయణ తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.