AP Cyclon: మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి రాష్ట్రంవైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో పాటు. ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రభావంతో సెప్టెంబరు చివరి వారంలో మళ్లీ వానలు పడతాయంటున్నారు.
ఇప్పటికే బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కుపోయారు. ఇపుపడిపుడే జనం వరద గుప్పిట నుంచి తేరుకుంటున్నారు. వరద మూలంగా ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికేట్స్ నీటి పాలయ్యాయి. దీంతో ప్రజలకు దిక్కు తోచని స్థితి ఏర్పడింది. మరోవైపు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వరదల కారణంగా పనికిరాకుండా పోయాయి. వరదల కారణంగా మెజారిటీ కట్టుకున్న బట్టలు తప్పించి మరేమి లేకుండా రోడ్డు మీదికొచ్చారు. మొత్తంగా వరదల కారణంగా ఇపుడిపుడే తేరుకుంటున్న ప్రజలకు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం అంటూ వస్తున్న వార్తలతో అల్లాడుతున్నారు.
ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారింది.
ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారుతుందనే ఆందోళన ముంపు ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.