Sajjala Ramakrishna Reddy On Pawan Kalyan: టీడీపీ పరిపాలనకు విసుగు చెందడంతోనే.. 2019లో చంద్రబాబుని ప్రజలే మార్చారని ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ మాటల్లో నిలకడ లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్‌కు ప్రజల కష్టాలు చూడలేదా..? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన చంద్రబాబు, పవన్‌ది అని.. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదన్నారు. పవన్  ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని నిన్న సభకి పవన్ వచ్చేలా చంద్రబాబు చేశాడని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల జీవితంలో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకి సేవ చేస్తే ప్రజలే అధికారం ఇస్తారని అన్నారు. పవన్‌ది రాజకీయ పార్టీలా ఉందా..? రాజకీయ పార్టీగా ఉంటే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"చంద్రబాబు పనితీరు బాగుంటే 2019లో ఎందుకు విడిగా పోటీ చేశారు..? ఒప్పందం ఏంటో చెప్పాలి. జన్మభూమి కమిటీ అనగానే అవినీతి గుర్తుకు వస్తుంది. కోటి 47 లక్షలు కుటుంబాలకి మా ప్రభుత్వంలో లబ్ది చేకూరుంది. చంద్రగిరి నుంచి బాబు కుప్పానికి ఎందుకు వచ్చాడు..? లోకేష్ మంగళగిరి ఎందుకు వచ్చాడు..? గంటా ఎన్ని సార్లు మారాడు..? టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్‌ని పెట్టుకోండి. పవన్ మాటలు వింటే చంద్రబాబు సీఎంగా చేయాలని అనిపించింది. చంద్రబాబుని సీఎంగా చేస్తా అంటే పవన్ వెనకాల ఉంటే ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారు. 


రాజకీయ పార్టీలో స్థానాలు మార్పు అనేది సహజం. రాష్టంలో ప్రజలు బాగున్నారు కాబట్టి చంద్రబాబు, పవన్ ఇక్కడ ఇల్లు కూడా లేదు. హైదరాబాద్‌లో ఉండి రాష్టాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. 2014-19లో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు ఇచ్చారో చెప్పాలి.. సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం.. మెడికల్ డిపార్ట్‌మెంట్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైసీపీ వచ్చాక 6 లక్షలు మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. మా పార్టీ వాళ్లు మారే ఉద్ధేశం ఉంటే వాళ్లకు అభ్యర్థులు కూడా లేరు కాబట్టి చేర్చుకోండి. భ్రమలో పెట్టి చంద్రబాబు అధికారంలోకి రావాలని చుస్తున్నారు ప్రజలు జాగ్రత్త.. టీడీపీ జనసేన పార్టీల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. ఇంకా బీజేపీని కూడా కలపాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు.


జగన్ కంటే చంద్రబాబు  ప్రజలకి చేసింది ఏం లేదు. చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలు గతంలో పాలన ఏం అయ్యాయి.. రెండేళ్ల క్రితం నుంచి అభ్యర్థుల పనితీరు బట్టే టిక్కెట్ ఉంటుందని చెప్పాం. టీడీపీలో కూడా మార్పులు జరుగుతాయి. వాళ్లకు అభ్యర్థులు లేకపోవడంతో కానీ వాళ్లకు అభ్యర్థులు ఇంకా స్టార్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట ఎన్నికలు సంబంధం లేదు.. బెస్ట్ టీమ్ కోసం ఈ మార్పులు చేస్తున్నాము.. మేము తలుపు తీస్తే రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.." అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook