Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే
Sankranti Holidays: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Holidays: సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు వికిసించి కన్పిస్తాయి. గ్రామ గ్రామాల్లో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సెలవులిచ్చేశారు. స్కూళ్లకు ఎప్పటి నుంచి సెలవులనేది క్లారిటీ వచ్చింది. ఏపీ, తెలంగాణలో అధికారికంగా సెలవులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెలవుల్ని ప్రకటించాయి. ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలలకు పెద్దఎత్తున సెలవులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 10 నుంచి 19 వరకూ సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 20 నుంచి స్కూళ్లు తిరిగి తెర్చుకోనున్నాయి. ఏపీలో మొత్తం 10 రోజులు పాఠశాలలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక తెలంగాణలో ఏపీ కంటే కొద్గిగా తక్కువ రోజులు సెలవులిచ్చారు. తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17 వరకూ మొత్తం ఏడు రోజులు సంక్రాంతి సెలవులిచ్చింది ప్రభుత్వం. ఈ నెల 18న తిరిగి స్కూళ్లు తెర్చుకోనున్నాయి. ఇక కళాశాలలు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులిచ్చేశారు. ఈ నెల 17న తిరిగి తెర్చుకోనున్నాయి.
Also read: Cold Waves: నేటి నుంచి 3 రోజులపాటు జాగ్రత్త.. మరింత తీవ్రం కానున్న చలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.