Anandaiah Medicine: ఆనందయ్యకు సహకరించేందుకు కార్యాచరణ సిద్ధం : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. మందు పంపిణీ సామాన్యులకు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. మందు పంపిణీ సామాన్యులకు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు(Krishnapatnam Anandaiah medicine) అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు (Ap High Court) అనుమతిచ్చిన తరువాత పంపిణీ ప్రారంభమైంది. మందు లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందుగా స్థానికులకే పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలో మందు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ సహకారం లేదంటూ స్వయంగా ఆనందయ్య ప్రకటించిన పరిస్థితి. ఈ విమర్శలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అందరికీ మందు పంపిణీకి సిద్ధమేనని ఆనందయ్య ప్రకటించారని స్పష్టం చేశారు. సామాన్యులకు మందు అందడం లేదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
ఇక ప్రభుత్వం నుంచి సహకారం విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan reddy) స్పందించారు. ఆనందయ్య ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి కోరుతున్నారో జిల్లా కలెక్టర్ కు నివేదిస్తే కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు. వైఎస్ జగన్ (Ys Jagan) మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాల్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం (Telugu Desam)పార్టీ అనవసర రాద్ధాంతం తప్ప..నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైందని విమర్శించారు.
Also read: AP Corona Update: ఏపీ రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook