Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టెంపో నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు..
Satya Sai Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Satya Sai Road Accident: ఆగి ఉన్ లారీని టెంపో ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈరోజు ఉదయం జరిగింది. టెంపోలో తిరుమల వెళ్లి వస్తుండగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతులు అమలాపురం, గుడిబండ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 14 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శనివారం ఉదయం తెల్లవారుజాము పొగ మంచు కమ్మడంతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం చేసుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అవగాహనలో 14 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. సీఎన్‌జీ ట్రక్ పేలి ఐదుగురి సజీవదహనం, భయానక వీడియో వైరల్..
సిద్దిపేటలో మరో ఘటన...
సిద్దిపేట జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం పూర్తిగా పొగ మంచు కమ్మేయడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పటికే వాహనాలకు లైట్లు వేసుకోమని ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడికక్కడే మృతి చెందారు వీరంతా దేవరకొండకు చెందిన వారిగా గుర్తించారు. డీసీఎం బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో వీరంతా అక్కడికక్కడే కిందపడి మరణించారు. ఇందులో ఇద్దరు పురుషులో ఒక మహిళ ఉంది
ఇదీ చదవండి: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!
వాహనాలకు ప్రమాదం ఇందులో కొంతమంది అతివేగం మరికొన్ని వాతావరణం కారణంగా కూడా జరుగుతుంది.. ఈ సీజన్‌లో పూర్తిగా పొగ మంచు కమ్మేయడంతో ఉదయం, రాత్రి సమయంలో వాహనాలు కనబడుటలేదు. దీంతో లైట్లు వేసుకోని వెళ్లాలని వాతావరణ శాఖ వారు కూడా ఆదేశించారు. అయితే పూర్తిస్థాయిలో ఈ ఆదేశాలను అందరూ పాటించడం లేదు. అతివేగం నిద్ర మత్తు కూడా దీనికి కారణం అవుతుంది. నిన్న రాత్రి యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఒక జంట కూడా తీవ్ర ప్రమాదానికి గురైంది. వీళ్ళు కూడా మరణించారు. ముఖ్యంగా సిద్దిపేట ,చేర్యాల, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ పట్టణాల్లో అయితే పూర్తిగా పొగ మంచు కమ్మేసింది చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను వెళ్లి డీకొంటున్నాయి. దీంతో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో పూర్తిగా చలి తీవ్రత పెరిగింది. పొగమంచు కమ్మేసింది. ఎముకల కొరికే చలి ఎక్కువవుతోంది. ఈనేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేయాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు కేవలం వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహదారులు లైట్లు వేసుకుని మాత్రమే వెళ్లాలి. ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ఐఎండీ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.