Tirumala: కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులతోపాటు తిరుమల దర్శనం రద్దు
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Kishan Reddy: రాజకీయాలకు కేంద్రంగా మారుతున్న తిరుమల ఆలయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. అంతేకాకుండా తిరుమల దర్శనం కూడా రద్దు చేయాలని ప్రకటించారు. అప్పుడే తిరుమల ఆలయ పవిత్రత పెరుగుతుందని.. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు.
Also Read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్ర తో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు తర్వాత కేంద్ర మంత్రిగా తిరుమల దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు.
Also Read: Pawan Kalyan: ఇంటింటికీ తాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలికారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలు మంచివని ప్రశంసించారు. మంచి నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 'అన్యమతస్తులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుంటే అభిప్రాయ భేదాలు ఉంటాయని చాలాసార్లు టీటీడీకి విన్నవించుకున్నాం. అన్యమతస్తులను వేరొక దగ్గరికి పంపాలని బోర్డు నిర్ణయాలు తీసుకోవడం శుభ పరిణామం' అని కొనియాడారు.
తిరుమలలో రాజకీయలు మాట్లాడితే కేసులు పెడతామని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేసులతో పాటు దర్శనాలు కూడా రద్దు చేయాలని కోరారు. అలా చేస్తేనే తిరుమల ఆధ్యాత్మిక పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు. టూరిజం టికెట్స్ రద్దు చేయడాన్ని కూడా అభినందించారు. టూరిజంలో చాలా అవకతవకలు జరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇవరించారు. స్థానికులకు నెలలో ఒకరోజు దర్శనం కల్పించడం మంచిదేనని టీటీడీ నిర్ణయాన్ని స్వాగతించారు. టీటీడీ ఇలాంటి నిర్ణయాలు అమలు చేసి తిరుమల పవిత్రత కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. మాజీ ఎంపీ కేశినేని నాని, సినీ నటులు ప్రభ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter