Drinking Water Issue: గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయిందని విమర్శించారు. ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ప్రజలకు తాగునీరు అందిస్తామని తెలిపారు.
Also Read: Vizag: 'వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?'.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్ రేప్
ప్రజారోగ్య పరిరక్షణ.. కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు వచ్చి ఉండేదని చెప్పారు. అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగు మారిన నీరు పంపుల ద్వారా వెళ్లే పరిస్థితి నెలకొందని వాపోయారు. తమ ప్రభుత్వం ప్రజలకు స్వచ్చమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ఇటీవల పల్లె పండుగలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ నియోజకవర్గంలో రంగుమారిన నీటి సరఫరా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలపడంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్కడి అధికారులు నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. రూ.3.3 కోట్లు నిధులతో ఈ పనులు చేపట్టడంతో అక్కడ సురక్షిత నీళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు మాట్లాడుతూ... 'ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం.. ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడవద్దు' అని స్పష్టం చేశారు. 'గత పాలకులు నిర్లక్ష్యపూరిత వ్యవహారం కారణంగానే డయేరియా లాంటివి ప్రబలాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు ఎప్పటికప్పుడు కాల వ్యవధిలో నిర్వహణ పనులు చేపట్టాలి' అని సూచించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా అనేది ప్రభుత్వ లక్ష్యమని.. దీనికి నిర్మాణాత్మకంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన విధానాన్ని ఒక మోడల్‌గా తీసుకోవాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter