Student Unions Calls For Schools Colleges Bandh: ఆంధ్రప్రదేశ్‌లో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం పాఠశాలలు, కాలేజీల బంద్ చేపడుతున్నట్లు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌), ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు తెలిపాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించాయి. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలరి.. ఖాళీగా ఉన్న 53 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. అలాగే కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా టీఎన్ఎస్‌ఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ.. ఇష్టారాజ్జంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన ఫీజులను కార్పొరేట్ కాలేజీలు పాటించడం లేదని.. వెంటనే ప్రభుత్వ నిబంధనలు అమలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని.. వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 53 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.


ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌళిక వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే హాస్టల్స్‌లో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మెస్‌ ఛార్జీలు పెంచాలని.. కాస్మోటిక్‌ ఛార్జీలు ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్‌, అటెండర్‌, వాచ్‌మెన్ వంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఈ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా మహిళల వసతి గృహాలకు కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించాలన్నారు.  


స్కూల్స్, కాలేజీల బంద్‌ను విద్యార్థులు బంద్‌ను జయప్రదం చేయాలని టీఎన్ఎస్ఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటీవలె ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. 


Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి