Ap Sec issue: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి
Ap Sec issue: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డకు జైలుశిక్ష తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
Ap Sec issue: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డకు జైలుశిక్ష తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఓ వైపు పంచాయితీ ఎన్నికలు ( Panchayat Elections ) కొనసాగుతున్నాయి. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు..ప్రభుత్వ పెద్దలతో వివాదం మాత్రం ఆగడం లేదు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) ఆంక్షలు విధించారు. పంచాయితీ ఎన్నికలు ముగిసేవరకూ నివాసానికే పరిమితం చేయాలని..మీడియాతో సైతం మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Dgp Gowtham Sawang )కు ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు.ఉత్తర్వులపై మండిపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ).
కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్‌ఈసీ ( SEC )హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని, చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఏదోవిధంగా చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ తాపత్రయంలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ( Privilege Committee ) ముందు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. నిమ్మగడ్డకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Also read: Ap Panchayat Elections 2021: మరోసారి వివాదాస్పద ఉత్తర్వులిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook