క్లాస్‌మేట్‌కు మత్తు మందిచ్చి బీటెక్ విద్యార్థుల అఘాయిత్యం
Sexual Assault On Btech Student | ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను అశ్లీలంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింతగా బరితెగిస్తున్నారు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పింది.
తోడుగా ఉండాల్సిన సహచర విద్యార్థులే ఆ యువతి పాలిట క్రూరంగా వ్యవహరించారు. క్రిమినల్ మైండ్‌సెట్‌తో ఆమెను బలవంతంగా లోబర్చుకున్నారు. చివరకు ఆ యువతికి మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించి పాశవికంగా లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్
ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడతామంటూ ఆ యువతిని బెదిరించారు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన దిశ పోలీసు బృందం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు కౌశిక్, వరుణ్‌లను అరెస్టు చేసింది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ ఘటన వివరాలను వెల్లడించారు. 2017 నుంచి ఈ ఇద్దరు విద్యార్థులు యువతి నగ్న చిత్రాలను నెట్‌లో పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మొదట యువతి చిత్రాలు నెట్‌లో పెట్టి తాత్కాలికంగా తొలగించారని చెప్పారు. ఆ తర్వాత నిందితులు కౌశిక్, వరుణ్ బాధితురాలి వీడియోలను పోర్న్ సైట్‌లో పెట్టారని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ