Rayachoti School Teacher: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. విద్యాబుద్ధులు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతడిని అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. ఈ సంఘటన ఏపీలో సంచలనం రేపింది. విద్యార్థులు అంతలా కొట్టడానికి గల కారణాలు ఏమిటి? దాడి ఎందుకు జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Wine Shops: ఏపీలో మందుబాబులకు షాక్‌.. రేపు వైన్స్‌ బంద్‌


అనంతపురం జిల్లా రాయచోటిలో కొత్తపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు యథావిధిగా బుధవారం విధులకు హాజరయ్యారు. పాఠశాలలో కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఒకరికొకరు దాడి చేసుకుంటుండడంతో ఉపాధ్యాయుడు నిలువరించారు. కొట్టుకోవద్దని చెప్పడమే అతడికి శాపంగా మారింది. దాడి చేసుకుంటున్న విద్యార్థులంతా కలిసి ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో ఛాతీ మీద.. ముఖం మీద దాడికి పాల్పడ్డారు. దాడిలో టీచర్‌ కళ్లద్దాలు కూడా విరిగిపోయాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Also Read: AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్‌ 'డ్రోన్‌'.. సీఎం చంద్రబాబు ఆదేశం


 


వెంటనే తోటి ఉపాధ్యాయులు స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడకు చేరుకున్న కాసేపటికే ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఉపాధ్యాయ లోకం దిగ్భ్రాంతికి లోనయ్యింది. పాఠశాలలో విద్యార్థులు సృష్టించిన బీభత్సం హృదయ విదారకంగా మారింది. ఈ సంఘటనతో ఉపాధ్యాయ సమాజం దిగ్భ్రాంతికి లోనయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. సంఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. కాగా దాడికి పాల్పడిన విద్యార్థులందరూ మైనర్లు కావడంతో పోలీసులు వారి వివరాలు వెల్లడించడం లేదు. అయితే పాఠశాలలో ఏం జరిగిందనే మాత్రం తెలియలేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.