Lockdown: కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటంతో..రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ఆవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ప్రతాపం పెరుగుతోంది. ఏపీలో రోజురోజుకీ కరోనా కొత్త కేసులు అధికమౌతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 14 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో కరోనా యాక్టివా్ కేసుల సంఖ్య 83 వేల 610కు పెరిగింది. విశాఖపట్నంలో అత్యధికంగా 2 వేల 258 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ తరువాత అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరులో 1458, కర్నూలులో 1238, చిత్తూరులో 1198, తూర్పు గోదావరి జిల్లాలో 1012 కేసులు నమోదయ్యాయి.


మరీ ముఖ్యంగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో విద్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించలేదు. స్కూల్ పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ (Lockdown)విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. కరోనా వైరస్ సంక్రమణను కట్టడి చేసేందుకు ఏపీలో ఆంక్షలు కఠినం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ (Night Curfew) కొనసాగుతోంది. ముందుగా వీకెండ్ లాక్‌డౌన్ విధించి..ఆ తరువాత పూర్తి లాక్‌డౌన్ విధించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అటు విద్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించాల్సిన అవసరం కన్పిస్తుంది. 


Also read: Corona Pandemic: రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఏం జరుగుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.