రాజధాని అమరావతిపై ఏపీ సర్కార్ సమీక్షించాలన్న ఆలోచనపై  సింగపూర్ ప్రభుత్వం స్పందించారు. సింగపూర్ లోని ఓ సదస్సులో  ఆ దేశ ఆర్ధిక మంత్రి బాలకృష్ణన్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును రివ్యూ చేయాలనుకుంటోందని...ఈ విషయం తనకు సింగపూర్ కన్సారియ తనకు తెలిపిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాజెక్టులపై సమీక్షించుకనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని బాలకృష్ణన్ ... ఏపీ ప్రభుత్వం నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సమీక్ష ప్రభావాన్ని కూడా అంచనా వేస్తున్నామని తెలిపారు


రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన విషయం తెలిసిందే.  చంద్రబాబు హయంలో నగర నిర్మాణానికి  సంబంధించిన పలు ప్రాజెక్టులపై ఏపీ సర్కార్-సింగపూర్ ప్రభుత్వం పై పలు ఒప్పందాలు జరిగాయి. జగన్ సర్కార్ దీనిపై సమీక్ష నిర్వహించాలనుటోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఆలోచన పై సింగపూర్ ఆర్ధిక మంత్రి ఈ మేరకు స్పందించారు.