Ap Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు
Ap Corona Update: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కోవిడ్19 కేసుల్లో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో 24 గంటల్లో కరోనా కారణంగా 96 మంది మరణించారు.
Ap Corona Update: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కోవిడ్19 కేసుల్లో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో 24 గంటల్లో కరోనా కారణంగా 96 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిన కరోనా కేసులు (Ap Corona Cases) నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రికవరీ రేటు స్వల్పంగా పెరుగుతోంది. నిన్న 92 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..18 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వరకూ ఆ సంఖ్య ప్రతిరోజూ 21-22 వేల వరకూ ఉండేది. ఇప్పుడు గత 24 గంటల్లో కేసుల సంఖ్య మరింతగా తగ్గింది. గత 24 గంటల్లో ఏపీలో కేవలం 12 వేల 994 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) కూడా నిన్నటితో పోలిస్తే తగ్గాయి. గత 24 గంటల్లో ఏపీలో 58వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1 కోటి 86 లక్షల 76 వేల 222 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఏపీలో గత 24 గంటల్లో కరోనా కారణంగా 96 మంది మరణించగా..అత్యధికంగా చిత్తూరులో 14 మంది, అనంతపురంలో 9, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 8, గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో 7 గురు మరణించారు. అదే సమయంలో గత 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి 18 వేల 373 మంది కోలుకున్నారు. అంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం ఊరట కల్గించే అశంగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 652, చిత్తూరులో 1620, విశాఖలో 1690, అనంతపురంలో 1047 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 3 వేల యాక్టివ్ కేసులున్నాయి.
Also read: AP Corona Update: ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, పెరిగిన రికవరీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook