Snake hulchul at MP Rammohan Naidu house: శ్రీకాకుళంలోని (Srikakulam) ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి ఆవరణలో రక్తపింజర పాము కలకలం రేపింది. విషపూరితమైన ఆ రక్తపింజర (Rakta Pinjari) భయంకరంగా బుసలు కొడుతూ హడలెత్తించింది. దీంతో ఎంపీ నివాసంలోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించగా.. ఆ సిబ్బంది అక్కడి చేరుకుని పామును పట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీకాకుళం (Srikakulam) నగరంలోని 80 ఫీట్ రోడ్డులో రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) నివాసం ఉంది. మంగళవారం (డిసెంబర్ 21) ఉదయం ఇంటి ఆవరణలో రక్తపింజరను సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో అది భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో సిబ్బంది భయపడిపోయారు. వెంటనే గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.


కాసేపటికి అక్కడికి చేరుకున్న హెల్ప్ లైన్ నిర్వాహకులు చాకచక్యంగా ఆ పామును (Snake) సంచిలో బంధించారు. దీంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది... ఆ పామును సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.


Also Read: జరక్క జరక్క లేటు వయసులో ఆ బ్రహ్మచారికి పెళ్లి... ఇంతలోనే ఊహించని షాకిచ్చిన నవ వధువు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook