Jagan Attack: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రిపై దాడి జరగడం.. గాయపడడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు దాడి చేశాయని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం పబ్లిక్‌ స్టంట్‌ అని ఆరోపించింది. జగన్‌పై దాడి ఒక డ్రామా అని చెబుతున్నారు. దీంతో జగన్‌పై దాడి ఘటనపై చాలా అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లు విసిరిన ఆకతాయిలు.. ఎడమ కంటి పై భాగంలో తీవ్ర గాయం..


 


ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరిట బస్సు యాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌ విజయవాడలోని సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి పర్యటించారు. గంగానమ్మ గుడి సమీపంలో జగన్‌పై దాడి జరిగింది. ఈ ఘటన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసం సమీపంలో చోటుచేసుకుంది. జగన్‌ ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి చిన్నగా దెబ్బ తగిలింది.

Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది


 


ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాదిరే ఇతర వర్గాల అనుమానాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వచ్చే అనుమానం ఏమిటంటే 'విద్యుత్‌ సరఫరా లేకపోవడం'. ఈ అనుమానం అందిరలోనూ మెదలుతోంది. ఒక ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉండడం ఏమిటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 'విద్యుత్‌' విషయంపైనే అందరూ ప్రశ్నిస్తున్నారు.


ముఖ్యమంత్రి భద్రత ఇలా..
ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), ముఖ్యమంత్రి సెక్యూరిటీ బృందం (సీఎంఎస్‌జీ), క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూపు, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, అవుటర్‌ కార్డన్‌, పెరిఫెరీ వంటి దాదాపు 200 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉంటారు. దీనికి అదనంగా స్థానిక పోలీసులు కూడా ఉంటారు. సీఎం పర్యటనకు భద్రతా దళాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తారు. చీమ చిటుక్కు మన్నా భద్రతా సిబ్బంది క్షణాల వ్యవధిలో స్పందిస్తాయి. మరి అలాంటిది బహిరంగ సభలో ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. 


  • ముఖ్యమంత్రి జగన్‌ కదిలే సమయంలో ఆయన అంతర్గత భద్రత సిబ్బంది మొత్తం వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంది. రాయి విసిరిన సమయంలో సిబ్బంది పసిగట్టలేకపోయింది. క్షణికావేశంలో స్పందించాల్సిన భద్రతా దళాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి?

  • ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలందరిపై నిఘా ఉండాలి. జనాల్లో కలిసి అనుమానాస్పదంగా కనిపించాల్సిన వారిని అదుపులోకి తీసుకోవాలి. మరి వాళ్లు ఏం చేస్తున్నారు?

  • ముఖ్యమంత్రి బస్సును స్పెషల్‌ బ్రాంచ్‌, నిఘా విభాగం అనుక్షణం తనిఖీ చేయాలి. వాళ్లు ఏం చేస్తున్నారు?

  • విద్యుత్‌ సరఫరా లేకపోతే ఫ్లడ్‌ లైట్లై వేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంది. విద్యుత్‌ అధికారులు ఏం చేస్తున్నారు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter