Somuveer Raju Letter: ఏపీలో వరి మంటలు..సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖాస్త్రం..!
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో వరికి మద్దతు ధర లేదని..కొనుగోలులో ఘరానా మోసం జరుగుతోందన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మకై రైతులకు అన్యాయం చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు.
ఇదే విషయాన్ని ఎన్నోసార్లు వివరించినా..ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా దీనిపై చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు దోపిడీపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం స్పందించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు చూసైనా ప్రభుత్వం నుంచి చొరవ లేదని ఫైర్ అయ్యారు. తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పండుతోందని లేఖలో ప్రస్తావించారు.
రైతులకు కుచ్చుటోపి పెడుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. రైతుల ఖాతాల నుంచి చిరునామాలు గల్లంతు అవుతున్నాయని లేఖలో గుర్తు చేశారు సోమువీర్రాజు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1455 ఇవ్వాలని..ఐతే రూ.1200 కంటే తక్కువ మాత్రమే ఇస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల ప్రమేయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆర్‌బీకేల నుంచి ధాన్యం కొనుగోలు జరగాలన్నారు. దోపిడీ వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను సైతం ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు దోపిడీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Also read:TS Govt: తెలంగాణలో డీఎస్పీల బదిలీలు..పోస్టింగ్‌లు ఎక్కడ..!
Also read:1 Lakh Umbrella: ఆ గొడుగు ధర అక్షరాల రూ.లక్ష..ఏమిటా కథ.. విశేషాలు ఏంటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.