1 Lakh Umbrella: ఆ గొడుగు ధర అక్షరాల రూ.లక్ష..ఏమిటా కథ.. విశేషాలు ఏంటి..?

1 Lakh Umbrella: సోషల్‌ మీడియాలో ఓ గొడుగు ట్రెడింగ్‌గా మారింది. దానిని కొనుగోలు చేసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడైన గొడుగును వర్షంలో తడవకుండా ఉపయోగించుకుంటాం. కానీ దీనిని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈగొడుగు ధర చూస్తే అందరూ ఖంగుతినాల్సిందే. గొడుగు ధర అక్షరాల లక్ష రూపాయాలుగా ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 06:51 PM IST
  • ట్రెడింగ్‌గా రూ. లక్ష గొడుగు
  • అందర్నీ ఆకట్టుకుంటున్న గొడుగు
  • కొనుగోలు చేసేందుకు నెటిజన్ల ఆసక్తి
1 Lakh Umbrella: ఆ గొడుగు ధర అక్షరాల రూ.లక్ష..ఏమిటా కథ.. విశేషాలు ఏంటి..?

1 Lakh Umbrella: సోషల్‌ మీడియాలో ఓ గొడుగు ట్రెడింగ్‌గా మారింది. దానిని కొనుగోలు చేసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడైన గొడుగును వర్షంలో తడవకుండా ఉపయోగించుకుంటాం. కానీ దీనిని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈగొడుగు ధర చూస్తే అందరూ ఖంగుతినాల్సిందే. గొడుగు ధర అక్షరాల లక్ష రూపాయాలుగా ఉంది.  

లగ్జరీ ఫ్యాషన్ హౌస్ గూచీ, స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్‌ సంయుక్తంగా గొడుగును తయారు చేశాయి. ఈ గొడుగు వాటర్ ప్రూఫ్‌ కాదని..సన్ ప్రొటెక్షన్‌ కోసం తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ గొడుగుతో వర్షంలోకి వెళ్తే తడిసి ముద్దవుతారని వెల్లడించారు.  చైనాలో ఇలాంటి గొడుగుల ఉత్పత్తి ధర అధికంగా ఉంటుందన్నారు. దీని ధర 1644 డాలర్లు ..అంటే లక్షా 20 వేలుగా ఉందని తెలిపారు. గొడుగు గురించి మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని తెలిపారు. 

ప్రస్తుతం సన్ ప్రొటెక్షన్‌ గొడుగుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి గొడుగును ఎక్కడ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వాలంటున్నారు. త్వరలో వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని నిర్వాహకులు సైతం రిప్లే ఇస్తున్నారు. మొత్తంగా సరికొత్త గొడుగు అందర్నీ ఆకట్టుకుంటోంది. వీటిని కొనుగోలు చేసేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు.    
 
Also read:Kl Rahul Record: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో సరికొత్త రికార్డు..ఏమిటది!

Also read:TS Govt: తెలంగాణలో డీఎస్పీల బదిలీలు..పోస్టింగ్‌లు ఎక్కడ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News