Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు
Monsoon Rains Alert: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రోజురోజుకూ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Monsoon Rains Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అయితే రేపు వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఏయే జిల్లాల్లో వర్షాలున్నాయో తెలుసుకుందాం
నైరుతి రుతు పవనాలు క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి. దాంతో పాటు చురుగ్గా ఉండటం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షసూచన జారీ అయింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక రేపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడే ప్రమాదమున్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఇక జూన్ 7వ తేదీ నుంచి రుతు పవనాలు మరింతగా విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చేవారంలో ఏపీలో వర్షపాతం మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ఏదేమైనా జూన్ నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడనున్నాయని సమాచారం.
Also read: AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook