Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించినా ఆశించిన మేర వర్షపాతం లేదు. దీనికితోడు గత వారం రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, వేడిమి పెరిగిపోయింది. వాతావరణంలో హ్యుమిడిటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంగా ఐఎండీ నుంచి శుభవార్త అందింది. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా రేపు అంటే ఆదివారం రాష్ట్రంలోని అన్నమయ్య, చిత్తూరు, కడప, సత్యసాయి, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు పిడుగులు కూడా పడే అవకాశముంది. ఇక జూన్ 17 సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


మరోవైపు వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదమున్నందున ఆరుబయట పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. చెట్ల కింద, విద్యుత్ స్థంభాల కింద ఉండవద్దని సూచిస్తోంది. 


Also read: Best Safety Car: క్రాష్ టెస్ట్‌లో తిరుగులేదిక, సేఫ్టీ ర్యాంకింగ్‌లో ఆ కారే టాప్ వెంటనే బుక్ చేసుకోండి మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook