Telangana Rains: తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Alert: వేసవి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అయితే ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 10 రోజుల్లో రుతుపవనాలు వచ్చేస్తున్నాయని తెలిపింది.
Rain Alert: తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా చోట్ల రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Weather Update: తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు, మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కీలక సూచనలు చేశారు.
Sudden Heavy Rain In Krishna And NTR Districts And Also Telangana Districts: వేసవికాలంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కమ్ముకుని భారీ వాన పడడంతో తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలతో సాధారణ ప్రజలతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Heavy Rains In Various Areas Of Hyderabad And Hailstorm Rains In Districts: ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఊరట చెందారు. వేసవికాలంలో అకస్మాత్తుగా వర్షం పడింది. హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో వర్షం పడింది. జల్లులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad: వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల్లో వానలుకురుస్తాయని ప్రకటించారు. దీనికి బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడగ ద్రోణి కారణంగా చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వానపడింది. లింగం పల్లి,దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, మేడ్చల్, సోమాజిగూడ, మొహిదీ పట్నం పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి ఒక్కసారిగా కొద్ది సేపు ఒక మోస్తరుగా వాన కురింది. దీంతో నగర వాసులు కాస్తంత ఉక్కపోత నుంచి రిలీఫ్ దొరికిందని పండగచేసుకున్నారు.
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉఫరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
AP Rain Alert: ఓ వైపు చలికి ప్రజలు గజగజ వణుకుతుంటే.. మరోవైపు ఏపీలో వానలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం వాయుగుండంగా బలహీన పడింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టిపుకు సమీపంలో శనివారం సాయంత్రం తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. అయితే ఈ వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొంతకాలంగా ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే మొన్నటి వర్షాలతో ఇబ్బందులు పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
Ap Schools Holidays: ఏపీ వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది.
Three Days Schools Holidays: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నెల 27, 28, 29 తేదీలలో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.
Schools Holiday For Tomorrow On October 23rd In AP Districts: ఏపీలో వరుసగా స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. రేపు మరో రోజు కూడా విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరుసగా రెండు రోజులు రావడం గమనార్హం. సెలవుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weather Report: తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అక్టోబరు 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పశ్చిమ దిశగా కదులుతూ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే వారం మొత్తం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం ప్రకటించింది.
Telangana Rains: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా పొద్దున, మధ్యాహ్నం ఎండా.. సాయంత్రం కాగానే ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Weather Alert: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. పలు జిల్లాలకు మరోసారి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దంటూ అప్రమత్తం చేశారు.
Hyderabad Rains: హైదరాబాద్ లో రానున్న మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉపరిత ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని, వర్షాల నేపథ్యంలో మ్యాన్ హోళ్ల దగ్గర జాగ్రత్తలు పాటించాలని వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది.
Heavy Rains In Ap: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో.. పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది.
Heavy Rains Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని సూచించింది.
Weather Updates In Ap: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం.. ఒడిశా రాష్ట్రం గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకింది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ.. క్రమంగా బలహీన పడనుంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ.. దాని ప్రభావం శుక్రవారం (అక్టోబర్ 3) కూడా కొనసాగనుంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.