Southwest Monsoon: ఆంధ్రావనిని తాకిన నైరుతి రాగం..రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..!
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రాగం తాకింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రాగం తాకింది. దీంతో రాయల సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైపు వేగంగా కదులుతున్నాయి. నైరుతి రుతు పవనాల వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నంద్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణకు కూడా నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన భాగాలకు వ్యాపించనున్నాయి. గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని మరి కొన్ని ప్రాంతాల్లోకి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో నైరుతి రుతు పవనాలు ముందుకు సాగుతున్నాయి.
నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తాజాగా ఈశాన్య బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం, మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ&5.8 కి.మీ ఎత్తులో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
రాగల మూడురోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. ఈదురు గాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండనుంది.
Also read: Minister Ktr: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..తాజాగా కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!
Also read:Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి