Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!

Prashant Kishor Meet to Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఇప్పటికే ఆలిండియా పర్యటను పూర్తి చేసి ఆయన.. జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 12, 2022, 06:37 PM IST
  • జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు
  • జాతీయ పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు
  • కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ
Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!

Prashant Kishor Meet to Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఇప్పటికే ఆలిండియా పర్యటను పూర్తి చేసి ఆయన.. జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చ జరుగుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రెండురోజులుగా హైదరాబాద్‌లో పీకే ఉంటున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్రీయ సంఘ్‌ ఏర్పాటు కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధుల భేటీలో దీనిపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిని ఆ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.

మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే విపక్ష నేతలు, సీఎంలకు ఆమె ఫోన్‌ చేశారు.  లేఖలు సైతం రాశారు. ఇందులోభాగంగానే సీఎం కేసీఆర్‌కు మమతా బెనర్జీ ఫోన్ చేశారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మనమంతా ఏకం కావాలని మమతా పిలుపునిచ్చారు. దీనికి సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!  

Also read: Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News