Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి గాలులు విస్తృతంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో జోరుగా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని  తెలిపింది. ఇటు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ, యానాం పరిసరాల్లో నైరుతి గాలులు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వీటితోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. 


కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గతేడాది కంటే ఈసారి అధిక వర్షపాతాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



Also read:Goose Bumps Video: ప్రాణాలకు తెగించి పట్టాలపై వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. రెండ్లు సెకన్లు లేటైతే అంతే సంగతి..!


Also read:Agnipath: చాయ్ అమ్మిన వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. ఆర్మీని అడ్డమీది కూలీలా మార్చేశారు! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.