Goose Bumps Video: ప్రాణాలకు తెగించి పట్టాలపై వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. రెండ్లు సెకన్లు లేటైతే అంతే సంగతి..!

Goose Bumps Video: నిత్యం సోషల్‌ మీడియాలో  లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరుతుంటే.. మరి కొన్ని భయాందోళనలు కలిగిస్తున్నాయి.  ప్రస్తుతం ఓ రైల్వే ఉద్యోగికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 12:47 PM IST
  • రైలు ఎదురుగా వస్తుండగా..
  • ప్రాణాలను పణంగా పెట్టి వ్యక్తి రక్షించిన రైల్వే ఉద్యోగి
  • నెట్టింట వైరల్‌ అవుతున్న ట్విటర్‌ పోస్ట్‌
 Goose Bumps Video: ప్రాణాలకు తెగించి పట్టాలపై వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. రెండ్లు సెకన్లు లేటైతే అంతే సంగతి..!

Goose Bumps Video: నిత్యం సోషల్‌ మీడియాలో  లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరుతుంటే.. మరి కొన్ని భయాందోళనలు కలిగిస్తున్నాయి.  ప్రస్తుతం ఓ రైల్వే ఉద్యోగికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తిని రక్షించడానికి రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అతన్ని రక్షించాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాకు చిక్కింది. రక్షించే క్రమంలో కొన్ని సెకన్ల తర్వాత.. అదే ట్రాక్ గుండా ఓ రైలు భారీ వేగంతో వెళ్ళింది. ఇంకొ రెండు సెకన్లు అక్కడె ఉంటే.. ఆ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసేవి. అయితే ఈ సంఘటనకు సంబంధించి వీడియో  రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది. 

రైల్వే మంత్రిత్వ శాఖ ఇలా ట్వీట్ చేసింది:

రైల్వే ఉద్యోగి హెచ్ సతీష్ కుమార్ ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుకు జెండాను ఊపేందుకు ప్లాట్‌ఫారమ్ వైపు వెళ్లాడు. ఇంతలోనే రైల్‌ ట్రాక్‌పై వ్యక్తి  పడిపోవడాన్ని చూసి వెంటనే అతన్ని రక్షించేందుకు ఆ ట్రాక్‌పైకి దూకాడు.. ఆ పడి పోయిన వ్యక్తిని ప్రాణాలతో రక్షించాడు రైల్వే ఉద్యోగి.  ఇదే క్రమంలో రైలు కూడా చాలా వేగంతో వచ్చింది. రెండు సెకన్లు ఆలస్యమైన ఇద్దరి ప్రాణాలు పోయోవి. సతీష్ దైర్య, సాహాసాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ  24 సెకన్ల సిసిటిని ఫుటేజీని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేసింది. 

 

సీసీటీవీ ఫుటేజీని చూస్తే ఆశ్చర్యపోతారు:

సతీష్ కుమార్ కొన్ని సెకన్లు ఆలస్యం చేసి ఉంటే.. రైల్వే ట్రాక్‌పై పడిపోయిన వ్వక్తి ఇద్దరిని రైలు ఢీకొని ఉండేది. అయితే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతను కావలనే పడిపోయాడా లేక  ప్రమాదవశాత్తు పడిపోయడే అనే అంశంపై పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ విషయం స్పష్టత రాలేదు.

ఇలా రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్‌ చేసింది:

విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా.. సాహసోపేతమైన సహాయంతో అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన సతీష్ కుమార్‌ను రైల్వే శాఖ అభినందించింది. సతీష్ కుమార్ వంటి ధైర్యవంతులు,  కష్టపడి పనిచేసే ఉద్యోగులను చూసి భారతీయ రైల్వే గర్విస్తోందని ట్విటర్‌లో ఖాతలో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. రైల్వే ఉద్యోగి చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News