ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ( Ap Special Status )  సాధ్యం కాదంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Ap Minister Pilli Subhash )  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మంత్రి పిల్లి సుభాష్ తో పాటు మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు ( Minister Mopidevi )   మంత్రి పదవులతో పాటు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ కేబినెట్ ( Ap Cabinet )  లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణలు తమ మంత్రి పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ( ycp ) తరపున రాజ్యసభకు ఈ ఇద్దరూ ఎన్నికవడంతో  ఈ రాజీనామాలు అనివార్యమయ్యాయి. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )  సుదీర్ఘ పోరాటం చేశారని...అయితే హోదా వస్తుందన్న  నమ్మకం తనకు లేదని చెప్పారు  పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. Also read: New Era in AP: ఏపీలో రేపటి నుంచి ఆధునిక అంబులెన్స్ లు ప్రారంభం  ఏడాదిగా పూర్తి సంతృప్తితో పని చేశానని...జగన్ ఏనాడూ తన శాఖలో జోక్యం చేసుకోలేదన్నారు. పార్లమెంట్ కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని...రాజ్యసభకు ఎంపిక చేయడంపై ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


మరోవైపు ఎమ్మెల్సీ పదవులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకట రమణల ఇచ్చిన రాజీనామాలను మండలి కార్యదర్శి ఆమోదించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని కూడా నోటిఫికేషన్ ( Mlc notification )  జారీ చేశారు. Also read: AP High Court: ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రద్దు