TTD: తిరుమలలో ఎప్పటిలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..!
TTD: తిరుమలలో భేటీ అయిన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు.
TTD: ఎప్పటిలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. రెండున్నరేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు యధాతథంగా జరగనున్నాయి. ఈఏడాది సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు మరో నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆగమ పండితుల సలహాల మేరకు ముందుకు వెళ్తామని టీటీడీ పాలక మండలి స్పష్టం చేసింది.
టెక్నాలజీ ఉపయోగించి బంగారు తాపడం పనులు నిర్వహించే దానిని పరిశీలిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో అక్టోపస్ భవన నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న విధంగానే సర్వ దర్శన విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్‌ఎస్‌డీ టోకన్ల జారీ పునరుద్దరణపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
జూలై 24 నుంచి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు జరగనున్నాయి. రూ.2.07 కోట్లతో నూతన పారువేటు మండపం నిర్మాణం, రూ.7.30 కోట్లతో ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టెండర్ ఖరారు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అమరావతిలోని శ్రీవారి ఆలయం పచ్చదనాన్ని పెంపొదించేందుకు రూ.2.09 కోట్ల నిధులు, బేడీ ఆంజనేయస్వామి మూల మూర్తికి ఉన్న రాగి కవచానికి బంగారు తాపడానికి రూ.18.75 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
తిరుమలలోని ఎస్వీ పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషన్ ముంబై ద్వారా మోడర్న్ స్కూల్‌గా రూపొందించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 రకాల టీటీడీ క్యాలండర్లు, డైరీలు ముద్రణకు టెండర్ ఆహ్వానించారు. రూ.4.42 కోట్లతో తిరుపతిలో స్విమ్స్ ఆస్పత్రి ఐటీ డెవలప్‌మెంట్ చేయనున్నారు. శ్రీవారి ఆలయ పోటు మోడ్రనైజ్ చేయాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 12 రకాల గో ఆథారిత వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు.
Also read:PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!
Also read:Indrakeeladri: ఇంద్రకీలాద్రిపైకి వాహనాలకు నో ఎంట్రీ..దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook