ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు ఒక్కసారిగా తెరపైకి రావడం ఇప్పడు చర్చనీయంశంగా మారింది. పాదయాత్ర నేపథ్యంలో కనీసం వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ చేసిన అభ్యర్థను కూడా తోచిపుచ్చడం ఆయన విషయంలో ఏ స్థాయిలో ఉచ్చు బిగిస్తోన్నారో అర్థమౌతోంది. వాస్తవానికి జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోడీ సర్కార్ కు బేషరతుగా మద్దుతిచ్చారు. ఇప్పటి వరకు మోడీ సర్కార్ పై విమర్శలు చేయకుండా వస్తున్నారు.  ఇంత చేస్తున్నా.. ఎందుకీ ఈ కేసు తెరపైకి వచ్చిందనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోదాపై మాట్లాడినందుకేనా జగన్‌కు ఈ కష్టాలు ?


నంద్యాల ఉపపోరులో వైసీపీ పరాజయం పొందడం.. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న బీజేపీ.. టీడీపీతో దోస్తి కొనసాగిస్తేనే మంచిదనే భావన ఉన్నట్లు రాజకీయవర్గాల నుంచి  సమాచారం. అలాగే మోడీకి ఏ మాత్రం ఇష్టం లేని ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తెరపైకి తీసుకురావడం కారణం చేత ఆయనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ ...జగన్ తో ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతిమంగా ఎవరు పై చేయి సాధిస్తారనే విషయం తేలాలంటే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే మరి .