AP Floods: విజయవాడ వరదలపై ఏం చేయలేం! భారమంతా దేవుడిపైనే..
Sujana Chowdary Sensational Comments On Vijayawada Floods: క్షణక్షణానికి విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతోంది. అయితే వరదలపై చేతులెత్తేయడమేనని.. భారమంతా దేవుడిపైనేనని చెప్పారు.
Vijayawada Floods: కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తడంతో విజయవాడ నగరం మునిగిపోయింది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తడంతో విజయవాడ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అయితే పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో బెజవాడవాసుల్లో భయాందోళన నెలకొంది. వరద తగ్గుముఖం పట్టకపోవడంతో మరింత ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read: Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్ర
విజయవాడ వరదలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరదల విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పుడు ఉన్న వరద కన్నా ఇంకా పెరిగితే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ లేదు' అని ప్రకటించారు. 'ఏం చేయలేమనే విషయాన్ని అధికారులే స్వయంగా తెలిపారు' అని చెప్పారు. ఇక విజయవాడకు పోటెత్తే వరదపై లెక్కలు వివరించారు. 'వరద నీరు 11:30 గంటల వరకు లక్షలకు మించి పెరిగితే తాము చేసేదేమి లేదు అంటున్న అధికారులు. ఇక భారం అంతా భగవంతుడు పైనే' అని నిస్సహాయ వ్యక్తం చేశారు.
Also Read: Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు
'ప్రకాశం బ్యారేజ్‌కి మూడు గేట్లు దెబ్బతిన్నాయి కాబట్టి గేట్లు ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇకపై వచ్చే వరదను అరికట్టే పరిస్థితి లేదు' అని ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. విజయవాడలో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద భారీగా పెరుగుతుండడంతో విజయవాడ వాసుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సుజనా అండగా నిలుస్తున్నారు. తన కార్యాలయం ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. 'వరద బాధితులు ఏదైనా సహాయం కోసం సంప్రదించాల్సిన కమాండ్ కంట్రోల్ నంబర్ 112 లేదా 107
లేదా సోషల్ మీడియా వేదిక ద్వారా మమ్మల్ని సంప్రదించండి' అని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
సహాయ చర్యలు ముమ్మరం
జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడవాసులను కాపాడేందుకు అధికారులంతా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. మోకాళ్ల లోతు నీరు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో దిగి బాధితులను ఆదుకుంటున్నారు. ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. ఇక వరదల్లో మునిగిన వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter