Summer Alert: తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పరిస్థితి మరీ ఘోరంగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. మరోవైపు తీవ్రమైన వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మే 29 వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల్నించే వేడి సెగలు భయపెడుతున్నాయి. వడగాల్పుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్న రాజమండ్రిలో వరుసగా రెండ్రోజులపాటు 48, 49 డిగ్రీలు నమోదవడం కలకలం రేపింది. అటు విజయవాడ, ఏలూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో సైతం 46-48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలు ఓ వైపు, వడగాల్పులు మరోవైపు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ఎందుకంటే రానున్న పదిరోజులు అంటే మే 29 వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా.


ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. మన్యం, వైఎస్ఆర్ కడప జిల్లా, ఏలూరు, విజయనగరం, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం 43-44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఉండవచ్చని అంచనా. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41-42 డిగ్రీలు నమోదుకావచ్చు.


ఎండల తీవ్రత మరో పదిరోజులు అంటే మే 29 వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఆ తరువాతే వాతావరణం చల్లబడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌కు విస్తరించే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


Also read: Janasena: గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన, పవన్ నిర్ణయాలే కారణమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook