ఈసారి వేసవి భగభగమండిపోనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ వెదర్‌మ్యాన్ హెచ్చరికలు అదే చెబుతున్నాయి. గత నాలుగేళ్ల కంటే ఈ వేసవి తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది. ఐఎండీ మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఫిబ్రవరి నెల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటు చలి తగ్గడం అటు ఎండల తీవ్రత ప్రారంభం కాకుండా బాగుంటుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు రెండ్రోజుల్నించి క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అదే సమయంలో ఈ వేసవి భగ భగ మండనుందని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో వేసవి తీవ్రత పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలైన రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనకాపల్లి ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రత 37-38 డిగ్రీలు నమోదు కావచ్చని తెలుస్తోంది.


గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ సహా సెంట్రల్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రానున్న 2-3 రోజుల్లో 37-38 డిగ్రీలకు చేరవచ్చు. పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి..తెల్లవారుజామున మాత్రం చల్లగా ఉంటుందని తెలుస్తోంది. 


మొత్తానికి ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందని ఏపీ వెదర్‌మ్యాన్  హెచ్చరిస్తోంది. ఈ ఏడాది ఎండల తీవ్రత గత నాలుగేళ్ల కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత అంతా రాజమండ్రి, ఏలూరు పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉండవచ్చని ఏపీ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ చెబుతోంది. 


అయితే గత ఏడాది తుపాను తీవ్రత అధికంగా లేకపోవడం, ఎండలు ముందుగానే ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల తరువాత అంటే మే నాటికి ఎండల తీవ్రత తగ్గిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఐఎండీ ధృవీకరించలేదు. మరోవైపు ఎల్‌నినో ప్రభావం పెద్దగా ఉండకపోవడంతో వర్షాలు కూడా భారీగానే ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Also read: Pawan Kalyan: ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? అంధ యువతి హత్య ఘటనపై పవన్ ఆవేదన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook