Pawan kalyan hot comments on ysrcp: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ హాట్ టాపిక్ గా మారారని చెప్పుకొవచ్చు. తిరుమల లడ్డు వివాదం ఎప్పుడైతే బైటపడిందో అప్పటి నుంచి పవన్ ఏపీలోనే కాకుండా, దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారారని చెప్పుకొవచ్చు. సనాతన ధర్మం అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటీవల తాను.. హోంమంత్రి అయితే.. పరిస్థితి మరోలా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. కొంత మంది పోలీసులు ఇప్పటికి కూడా వైసీపీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగ కుండా చూసుకొవాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. ఇటీవల ఏపీ పోలీసులపై కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. అంతే కాకుండా.. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ లకు పాల్పడుతున్న వారిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోషల్ మీడియాలో ట్రోలింగ్ లకు పాల్పడుతున్న వారిపై కేసులు సైతం నమోదు చేశారు.


తాజాగా, పవన్ కళ్యాణ్ గుంటూరులో నిర్వహించిన అమరవీరుల సంస్యరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖ డెవలప్ మెంట్ కోసం తమ సర్కారు అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అమర వీరులకు స్థూపాలు సైతం  నిర్మిస్తామన్నారు. అంతే కాకుండా.. 5 కోట్ల విరాళం సైతం అటవీ శాఖ కోసం సేకరిస్తామన్నారు. అటవీ శాఖలో విధుల్లో ఉంటూ.. 23 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.


వీరిని గుర్తు చేసుకుంటూ.. అటవీ శాఖలో వివిధ బ్లాక్ లకు వీరి పేర్లు పెట్టి గౌరవిస్తామన్నారు. అంతే కాకుండా.. పవన్ కళ్యాణ్.. ఐఏఎస్ లపై ఎవరైన ఇష్టమున్నట్లు ఆరోపణలు చేసిన, వారి జాబ్ లకు అడ్డు తగిలే పనులు చేసిన కూడా సుమోటోగా కేసులు నమోదు చేస్తామని పవన్ హెచ్చరించారు.


Read more: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన డీజీపీ ద్వారక తిరుమల రావు.. కారణం ఏంటంటే..?


అంతే కాకుండా.. ఐఏఎస్ లకు చిన్నగాటు పడిన వదిలే ప్రసక్తిలేదని వైసీపీకి  ఇండైరెక్ట్ గా పవన్ హెచ్చరించారు. తమది మంచి ప్రభుత్వం అని.. మెతక ప్రభుత్వం మాత్రం కాదని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కావాలంటే స్పెషల్ సెక్యురిటీ ఇస్తామని కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.