Very Sad in Krishna Own Village Burripalem: తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ దివికేగిశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంతో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ఊరి హీరో మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరివరకు గ్రామ అభివృద్ధి కృషి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. సొంతూరికి ఏదో ఒకటి చేయాలన్న తపన నిత్యం ఆయనలో కనిపించేదంటున్నారు. అలాంటి వ్యక్తి మా మధ్య లేకపోడం తీరని లోటు అని.. తన తల్లిదండ్రుల పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్‌ కృష్ణ.. పూర్తి పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి. 1943 మే 31న బుర్రిపాలెంలో వీర రాఘవయ్య, నాగరత్న దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ మక్కువతోనే సినిమాల్లోకి వచ్చారు. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ అయ్యారు. సిసిమాల్లో సూపర్‌ స్టార్‌గా ఎదిగినా.. తన సొంత గ్రామంపై మమకారం పోలేదు. ఏదో ఒకటి చేయాలన్న తపనతో తన తల్లిదండ్రులు వీర రాఘవయ్య, నాగరత్న పేరిట ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.


బుర్రిపాలెం గ్రామానికి వెళ్తే సూపర్ స్టార్‌ కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలే కనిపిస్తాయి. ఇప్పటికీ తన తల్లిదండ్రులకు గుర్తుగా ఇంటిని అలాగే ఉంచారు. బుర్రిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా పేరుతో నడుస్తోంది. పాఠశాలలో తన సొంత ఖర్చులతో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీర రాఘవయ్య, నాగరత్న పేరుతో కృష్ణ సాయి గీతా మందిరాన్ని ఏర్పాటు చేశారు. అంజయ్య, కమలాదేవి, ఇతర కుటుంబసభ్యుల పేరిట బస్టాండ్ ఉంది. స్థానికంగా ఆలయాన్ని కూడా సూపర్ స్టార్‌ కృష్ణ నిర్మించారు. కృష్ణ హఠాన్మరణం బుర్రిపాలెంతోపాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Also Read: నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది.. కృష్ణ మృతిపై స్టార్ కామెంటేటర్ సంతాపం!


Also Read: Krishna Demise: తెలుగు సినిమాకు సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేసిన చేసిన కృష్ణ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook