YS Jagan Mohan Reddy: జగన్ బెయిల్ రద్దుపై విచారణలో సంచలనం.. ధర్మాసనం ఏం చెప్పిందంటే..?
YS Jagan Mohan Reddy Bail Cancellation Petetion: మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో వాయిదా వేశారు. పూర్తి వివరాల ఇలా..
YS Jagan Mohan Reddy Bail Cancellation Petetion: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్ విచారణను నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సంజయ్ కుమార్ తెలిపారు. దీంతో సీజేఐ ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి ఈ పిటిషన్ విచారణ మారింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణను హైదరాబాద్ నుంచి కాకుండా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్‌ను వేశారు. ఈ రెండు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read: Tragic Incident: ప్రేమతో భార్య చికెన్ బిర్యానీ పెట్టగా.. తెల్లారేసరికి శవమైన భర్త
విచారణ మొదలైన తరువాత ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినదని జగన్ తరఫు లాయర్ ధర్మాసనానికి వివరించారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు కొంత సమయం ఇవ్వాలని సీబీఐ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అనంతరం జస్టిస్ సంజయ్ కుమార్ 'నాట్ బిఫోర్ మీ' అని చెప్పడంతో ఈ పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే నెల 2న విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రిజిస్ట్రీని సీజేఐ సంజీవ్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్ యాత్రకు ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి