Korutla MLA Padayatra: కేటీఆర్‌ యాత్రకు ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర

BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 12, 2024, 01:57 PM IST
Korutla MLA Padayatra: కేటీఆర్‌ యాత్రకు ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర

Korutla MLA Padayatra: ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర ప్రారంభించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు చేపట్టిన పాదయాత్రకు గులాబీ పార్టీతోపాటు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం గమనార్హం.

Also Read: Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు

రైతులను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పాదయాత్రను జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో మంగళవారం పాదయాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 'డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మళ్లీ డిసెంబర్ వచ్చిన రుణమాఫీ చేయకపోవడం ముఖ్యమంత్రి చేతగానీతనానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి' అని డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి రైతులను మరచిపోయింది. రాష్ట్రంలోని అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పాదయాత్ర చేస్తున్నా. రైతులందరికీ రుణమాఫీ వెంటనే అందించాలి. రైతుభరోసా పేరిట ఇస్తానన్న పెట్టుబడి సహాయం వెంటనే అందించాలి' అని పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ డిమాండ్‌ చేశారు.

Also Read: Collector Attack: కొడంగల్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు రైతుల్లో ఆగ్రహం.. పూర్తి వివరాలు ఇవే!

కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే సంజయ్‌ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలపనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. రేపు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రలో పాల్గొననున్నారు. 

యాత్రతో జగిత్యాలపై పట్టు
రైతుల సమస్యలపై చేపట్టిన పాదయాత్ర జగిత్యాల వరకు కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగిత్యాలలో గులాబీ పార్టీకి ఇప్పటికిప్పుడు పెద్ద నాయకుడు లేకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. వారిలో జోష్‌ తీసుకువచ్చేందుకు.. ఎమ్మెల్యే పార్టీ మారినా పక్క నియోజకవర్గ నాయకులు ఉన్నారనే జగిత్యాల కేడర్‌కు భరోసానిచ్చేలా ఈ యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో జగిత్యాల నుంచి కల్వకుంట్ల సంజయ్‌ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కోరుట్లతోపాటు జగిత్యాల బాధ్యతలు కూడా చూసుకోవాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. అందులో భాగంగానే సంజయ్‌ రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News