కృష్ణా జలాల వివాదంపై ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ కీలక వ్యాఖ్యలు
Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదం ఇటీవల పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదం(Krishna Water Dispute)పై ఏపీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయపరమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందంటూ సుప్రీంకోర్టులో(Supreme court) పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వివాదంపై తాను తీర్పు చెప్పలేనని ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ(Chief justice NV Ramana)వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే ఛీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అంశంలో సహాయపడుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్టప్రకారమే ముందుకెళ్లాలనుకుంటే..మరో ధర్మాసనం ముందు వాదనలు విన్పించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల న్యాయవాదులకు సూచించారు.
Also read: కృష్ణానదికి వరద పోటు, నిండుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook