AP Govt: ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్.. సిట్ విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
Supreme Court Green Signal To SIT Enquiry: ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టి వేసింది. అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాలలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలగిపోయాయి. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఏపీ ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలపై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ విచారణను సవాల్ చేస్తూ.. టీడీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృథా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా ప్రశ్నించించింది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా..? అని వ్యాఖ్యనించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదించింది. ఏపీ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. సిట్ దర్యాప్తుకు లైన్ క్లియర్ చేసింది.
డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరింది. మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిన అంశాలపై విచారణ జరపాలని సిట్ నియామిచింది. 2020లో ఫిబ్రవరి 21న సిట్‌ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో సమగ్రమైన చర్చ అనంతరం పూర్తి విచారణ జరపాలని అసెంబ్లీ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్ణయం మేరకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయతే హైకోర్టు స్టేతో ఇన్నాళ్లు సిట్ విచారణ నిలిచిపోయింది. అమరావతి కుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్, టీడీపీ నేతల అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌లో అవకతవకలపై సిట్ విచారించనుంది. మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిన ఇతర శాఖల్లోని అవినీతిపై కూడా విచారంచే అవకాశం ఉంది.
Also Read: Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్
Also Read: Aadhar Update 2023: ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబరు లింక్ చేశారా..? ఈజీగా తెలుసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి