Supreme Court: వివేకా హత్యకేసులో కీలక పరిణామం, కేసు సీబీఐ కోర్టుకు బదిలీ
Supreme Court: ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామమిది. కేసు దర్యాప్తు తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబసభ్యుల అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టులోని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నంల ధర్మాసనం..కేసును తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. కేసు బదిలీ వెనుక కారణాల్ని కూడా ధర్మాసనం వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చ్ నెలలో పులివెందులలోని ఆయన నివాసంలో హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడీ కేసును తెలంగాణ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హతుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె తల్లి దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు విచారణలో పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించాల్సి ఉండటం, సాక్షులకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో పాటు నేర విచారణ నిష్పాక్షికంగా ఉండటం కోసం కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, ఛార్జిషీటు, అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టుకు బదిలీ చేసి..విచారణ త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం తెలిపింది.
ఈ కేసులో న్యాయమైన విచారణ జరగకపోవచ్చని..లేదా పెద్ద కుట్ర దాగుందని పిటీషనర్ భయపడటాన్ని తోసిపుచ్చలేమని..అదే సమయంలో ఊహాజనితమని చెప్పలేమని..పిటీషనర్‌కు మాత్రం న్యాయం పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరమున్నందున..ఏపీ కాకుండా మరో రాష్ట్రానికి బదిలీ చేయదగిన కేసుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
Also read: Ap Government: ఆ అధికారిపై ఎంత ప్రేమో...ఏకంగా కొత్త పదవిని సృష్టించిన సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook