AP Municipal Election 2021: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్, పిటిషన్ కొట్టివేసిన Supreme Court
AP Municipal Election 2021 Petition | ఇటీవల హైకోర్టులోనూ ఏపీ మున్సిపల్ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పిటిషన్‌ను తిరస్కరించడం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
Supreme Court On AP Municipal Election 2021 Petition: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించటం సరికాదని సైతం సుప్రీం ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. ఇటీవల హైకోర్టులోనూ ఏపీ మున్సిపల్ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పిటిషన్‌ను తిరస్కరించడం తెలిసిందే.
ఏపీలో 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు ఎన్నికలు(AP Municpal elections 2021) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత నోటిషికేషన్ విడుదల చేసి చాలా కాలమైందని, ఆ నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా మున్సిపల్ ఎన్నికలకు మరో నోటిఫికేషన్ కోరుతూ కడప జిల్లాకు చెందిన కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిక్ అశోక్ కుమార్ సారథ్యంలోని ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని పిటిషనర్లకు సూచించింది.
Also Read: AP Municipal Elections 2021: ఏపీ ఎస్ఈసీ Nimmagadda Ramesh Kumar ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
కాగా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, కొత్త నోటిఫికేషన్ అవసరమా లేదా అనే విషయాన్ని ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటాయని ధర్మాసనం పేర్కొంది. అవసరమైతే వారి ఎస్‌ఈసీ విచక్షణాధికారంతో మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వాచ్ యాప్‌ను రద్దు చేస్తూ ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించేందుకు యాప్ తీసుకొచ్చిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్ తగిలింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook